Hyderabad: ఇంట్లోకి చొరబడి యువతితో అసభ్య ప్రవర్తన.. యువకుడిని స్తంభానికి కట్టేసి చావబాదిన మహిళలు

  • హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో ఘటన
  • యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన మహిళలు
  • చితకబాది పోలీసులకు అప్పగించిన మహిళలు

యువతితో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని పట్టుకున్న మహిళలు అతడిని స్తంభానికి కట్టేసి చావబాదారు. హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో జరిగిందీ ఘటన. జింకలవాడకు చెందిన అంజి (19) శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో స్థానికంగా ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతి చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు మహిళలు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.  

More Telugu News