Undavalli: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఆయన సొంతిల్లేమీ కాదు: మంత్రి బొత్స

  • అదంతా ఆక్రమించుకున్నారు
  • చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తదుపరి చర్యలు తప్పవు 
  • ప్రజావేదికనే కాదు అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేస్తాం

ప్రజావేదికనే కాదు అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రజావేదిక ఓ పెద్ద సమస్య కాదని అన్నారు. సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతోనే అక్రమ కట్టడాలను తొలగించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలని అన్నారు.

ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఆయన సొంతిల్లేమీ కాదని, అనుచరుడినో, తాబేదారునో పెట్టుకుని అదంతా ఆక్రమించుకున్నారని అన్నారు. ఈ విషయమై కూడా అధికారులు పరిశీలిస్తున్నారని, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సీఆర్డీఏలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు రూ.400 కోట్లతో ప్రారంభించి చివరకు రూ.700 కోట్లకు పెంచారని విమర్శించారు. సీఆర్డీఏ అధికారులతో రేపు సీఎం జగన్ సమావేశం కానున్నట్టు చెప్పారు.

More Telugu News