Imran khan: ఎవరో బ్యాటింగ్ తీసుకోమంటే తీసుకోం.. ప్రధానిపై పాక్ ఆల్‌రౌండర్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని ఇమ్రాన్ సూచన
  • భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన సర్ఫరాజ్
  • పరాజయంతో విమర్శల పాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘ఎవరో ట్వీట్ చేస్తే’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ప్రపంచకప్‌లో భారత్-పాక్ పోరుకు ముందు పాక్ జట్టు మాజీ కెప్టెన్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని సూచించారు. అలాగే, జట్టు కూర్పు ఎలా ఉండాలో కూడా సూచించారు.

అయితే, ఆయన సూచనను పెడచెవిన పెట్టిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత సర్ఫరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇమ్రాన్ సూచనను పట్టించుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదని అబిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా, తమ జట్టుపై వస్తున్న విమర్శలకు ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు. ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే ఏం చేయాలనేది జట్టు సమష్టిగా తీసుకున్న నిర్ణయమని, ఎవరో (ఇమ్రాన్ ఖాన్) చెబితే తీసుకునే నిర్ణయం కాదని తేల్చి చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనేది జట్టు నిర్ణయమని స్పష్టం చేశాడు. జట్టు ఓటమికి అందరూ బాధ్యులేనని హఫీజ్ పేర్కొన్నాడు.

More Telugu News