: ఫిక్సింగ్ చోటు చేసుకున్నా.. ఐపీఎల్ కేం ఢోకాలేదు: బీసీసీఐ చీఫ్


ఎవరో కొందరు ఫిక్సర్ల కారణంగా క్రికెట్ ప్రతిష్ఠేమీ మసకబారదని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన ఆటగాళ్ళను కఠినంగా శిక్షిస్తామని చెబుతూ, ప్రస్తుతానికి ఐపీఎల్ కొచ్చిన ఢోకా ఏమీలేదని శ్రీనివాసన్ అన్నారు. క్రికెట్ లో అవినీతికి పాల్పడే ఆటగాళ్ళు కుళ్ళిన కోడిగ్రుడ్లలాంటి వాళ్ళని పేర్కొంటూ, ఐపీఎల్ ఆడేవాళ్ళలో అత్యధికులు నిజాయతీపరులేనని చెప్పుకొచ్చారు. ఆటగాళ్ళ వద్ద తగినంత డబ్బు లేక కాదని, దురాశతోనే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News