Imran Khan: రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను జిబ్రాన్‌దిగా పేర్కొన్న ఇమ్రాన్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

  • దేశ ప్రధాని ఇంత తెలివితక్కువగా ఉంటాడని అనుకోలేదంటూ విమర్శలు
  • నెట్‌లో కనిపించినదంతా నిజం కాదన్న నెటిజన్లు 
  • చెక్ చేసుకోవాలంటూ హితవు 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఓ కవితను మరొకిరికి ఆపాదించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఓ దేశ ప్రధాని ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తారని అనుకోలేదని విరుచుకుపడుతున్నారు.

‘‘నేను నిద్రపోతున్నప్పుడు జీవితం ఆనందమయంగా ఉందని కలగంటాను. మెలకువ వచ్చాక ఈ జీవితమంతా సేవకేనని అనిపిస్తుంది. సేవ చేస్తున్నప్పుడు చూశాను.. అందులోనే ఆనందం ఉందని’’ అన్న రవీంద్రుడి అద్భుతమైన కవితను ఇమ్రాన్ లెబనీస్-అమెరికన్ రచయిత కాలీల్ జిబ్రాన్ రాసినట్టు పేర్కొన్నారు.

దీంతో ట్విట్టర్‌లో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. నెట్‌లో కనిపించేదంతా నిజం కాదని, దానిని చెక్ చేసుకోకుండా యథాతథంగా వాడేయొద్దని హితవు పలికారు. హ్యాష్ ట్యాగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది. కాగా, గతవారం కూడా ఇమ్రాన్ ఇలానే విమర్శలతో వార్తలకెక్కారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న ఆయన దౌత్యపరమైన ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు.  

More Telugu News