Kaleswaram: కాళేశ్వరం ప్రారంభం రోజున గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలి: కార్యవర్గ భేటీలో కేసీఆర్

  • పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రూ.19.2 కోట్లు
  • ప్రతి జిల్లాకు భవన నిర్మాణానికి రూ.60 లక్షలు
  • రాష్ట్ర కమిటీ సభ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం

పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రారంభోత్సవం రోజున అన్ని గ్రామాల్లోనూ సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు మునిసిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

రూ.19.2కోట్ల నిధులను పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించారు. టీఆర్ఎస్ భవన నిర్మాణానికి జిల్లాకు రూ.60 లక్షలు కేటాయించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఈ నెల 27 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు ఆ రోజు నుంచే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టనున్నారు.

More Telugu News