Chandrababu: హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నా: చంద్రబాబు
- హోదా విషయంలో రాజీపడలేదు
- 29 సార్లు ఢిల్లీ వెళ్లాను
- హోదా కోసం ప్రభుత్వానికి సహకరిస్తాం
టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదంటూ ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. 'ప్రత్యేక హోదా' పేరుకు ఆర్థిక సంఘం ఒప్పుకోకపోవడంతో పేరు మార్చి 'ప్రత్యేక ప్యాకేజి'గా ప్రకటించారని, హోదాకు సమానమైన ప్యాకేజి ఇస్తామంటేనే తాను ఒప్పుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తానెప్పుడూ రాజీపడలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశానని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం చేసే ప్రయత్నాలకు అన్నివిధాలుగా సహకరిస్తామని చంద్రబాబు ప్రకటించారు.