Telugudesam: టీడీపీ ఇచ్చిన హామీ అంటూ రైతులకు అన్యాయం చేయొద్దు: చంద్రబాబు
- టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ
- రుణమాఫీ చెల్లింపులను ప్రభుత్వం వెంటనే అందించాలి
- నాలుగైదు విడతల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలి
'రుణమాఫీ అన్నది గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ' అంటూ రైతులకు అన్యాయం చేయడం తగదని కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రైతులకు రుణమాఫీ చెల్లింపులను ప్రభుత్వం వెంటనే అందించాలని, నాలుగు, ఐదు విడతల రుణమాఫీ మొత్తాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారవని, ఏ ప్రభుత్వమైనా లబ్ధిదారులకు నష్టం చేసేదిగా ఉండకూడదని అన్నారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టడం అమానవీయమని, రుణమాఫీ విషయమై శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని తమ నేతలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.