: మాస్ కాపీయింగ్ తో 50 మంది డిబార్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 50 మందిని అధికారులు డిబార్ చేసారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ పట్టుబడ్డారు. అందరూ చూసిరాసుకుంటున్నా ఇన్విజిలేటర్లు స్పందించకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు మాస్ కాపీయింగ్ కి ఆలవాలమైపోయాయంటూ పలు ఫిర్యాదులందినా పరీక్షా కేంద్రాలు ఏ రకమైన చర్యలూ చేపట్టడం లేదని అధికారులు మండి పడుతున్నారు.