: స్పాట్ ఫిక్సింగ్ వేరు.. మ్యాచ్ ఫిక్సింగ్ వేరు!


రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు క్రికెటర్లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి స్పాట్ ఫిక్సింగ్ పదం వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఒకటి కాదు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే, ఒక జట్టు కావాలని ఓడిపోవడమో లేక గెలవడమో జరుగుతుంది. బుకీలతో ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా జట్టు అంతా కలిసి ఫిక్స్ అయి ఫలితాన్ని తారు మారు చేయడాన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు.

స్పాట్ ఫిక్సింగ్ అంటే ఒక్కో ఆటగాడు విడిగా చేసేది. ఉదాహణకు బ్యాట్స్ మెన్ అయితే, స్పాట్ ఫిక్సింగ్ చేసుకుని ఉంటే మొదటి బౌల్ కే అవుటవుతాడు. అలాగే 99 పరుగులు చేసి 100 కొట్టకుండా వికెట్ సమర్పించుకుంటాడు. బౌలర్ అయితే, కావాలనే వైడ్లు, నో బాల్స్ వేస్తాడు. అదీ నిర్ణీత ఓవర్లో. దీనినే స్పాట్ ఫిక్సింగ్ అంటారు. వాస్తవానికి ఇలా ఆటగాళ్ల పనితీరుపై బెట్టింగులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఒక క్రికెటర్ సెంచరీ కొడతాడని కోట్ల రూపాయలకు బెట్ వేసుకుంటారు. కానీ, ఫిక్సింగ్ జరిగితే 99కే అవుటవుతాడు. ఇలా బుకీలు కోట్ల రూపాయలకు బెట్టింగులు నడుపుతూ క్రికెటర్లను ప్రలోభ పెడుతుంటారు.

  • Loading...

More Telugu News