: కఠిన చర్యలు తీసుకోండి: క్రీడా మంత్రి
ఫిక్సింగ్ బాగోతం బయటపడడంతో కేంద్ర క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇలాంటి అనైతిక వ్యవహారాలకు ఆస్కారం లేకుండా నియంత్రిత చర్యలను అమల్లో పెట్టాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాను ఆదేశించారు. ఈ మేరకు జితేంద్ర రాజీవ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఫిక్సింగ్ లో పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.