Maharashtra: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ‘మహా’ సీఎం.. ఆహ్వానించేందుకు నేడు ముంబైకి కేసీఆర్

- ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
- దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆహ్వానించనున్న కేసీఆర్
- రెండు గంటలకు ఫడ్నవిస్‌తో భేటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు ఫడ్నవిస్‌ను కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.