YSRCP: ప్రాంతీయ బోర్డులకు చైర్మన్లను నియమించినట్టు వస్తున్న వార్తలు నిజంకాదు: వైసీపీ
- ఎవరినీ చైర్మన్లుగా నియమించలేదన్న వైసీపీ
- వివరణ ఇచ్చిన అధికార పక్షం
- ఏపీలో ఐదు మండళ్ల ఏర్పాటు అంటూ ప్రచారం
రాష్ట్రంలో జిల్లాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని వైసీపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డులకు చైర్మన్లను నియమించలేదని అధికార పక్షం వివరణ ఇచ్చింది. అంతకుముందు, ఏపీలో ఐదు మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, ఈ ఐదు మండళ్లకు ధర్మాన ప్రసాదరావు చీఫ్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. పార్థసారథి, కాకాని గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా తదితరులు చైర్మన్లుగా వ్యవహరిస్తారని కూడా మీడియాలో వార్తలొచ్చాయి.