YSRCP: జగన్ ఆ మాట చెప్పగానే ఎంతో గర్వంగా అనిపించింది: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్

  • శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన జగన్
  • భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే
  • జగన్ పై పొగడ్తల వర్షం

ఏపీ సీఎం జగన్ వ్యవహారశైలిపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ నడవడిక నుంచి తమ వంటి వారు కూడా ఎంతో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఇవాళ జగన్ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వరప్రసాద్ గతంలో ఐఏఎస్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పదకొండేళ్లుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

జగన్ ది చిన్నవయసే అయినా, ఎంతో పరిపక్వతతో నడుచుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ చెప్పింది వింటున్నారని ఆయన కొనియాడారు. "నేను ఇంతమందికి మంత్రిపదవులు ఇవ్వగలుగుతున్నాను, మిగిలిన వాళ్లకు ఇవ్వలేకపోతున్నాను, మంత్రి పదవులు దక్కనివాళ్లు మరోవిధంగా భావించవద్దు అని జగన్ మాతో ఎంతో వినమ్రంగా చెప్పారు. ఆ సమయంలో మాకు ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఇంత మర్యాదగా చెప్పిన ముఖ్యమంత్రి చరిత్రలో మరెవ్వరూ లేరు. సీఎం అనగానే నేనో దాదాని, నేను చెప్పినవాడే మంత్రి అనే ముఖ్యమంత్రులను చాలామందిని చూశాం కానీ, ప్రతి ఒక్కరికీ విడమర్చి చెప్పే ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. అవకాశం దక్కలేదని అవినీతికి పాల్పడవద్దు, ధైర్యంగా ఉండి ప్రజాసేవ చేసుకోండి, రెండున్నరేళ్ల తర్వాత మరోసారి సమీక్ష జరిపి అవకాశం దక్కనివాళ్లకు అవకాశం ఇస్తానని చెప్పారు" అంటూ జగన్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News