Jagan: రేపు అన్నిశాఖల ఉన్నతాధికారులతో జగన్ సమావేశం
- ఇప్పటికే పలు శాఖల సమీక్షలు నిర్వహించిన ఏపీ సీఎం
- రేపు అన్నిశాఖలతో లోతైన సమీక్ష
- క్యాబినెట్ ప్రమాణస్వీకారానికి ముందే సమావేశం
మరికొన్ని గంటల్లో ఏపీ కొత్త క్యాబినెట్ కొలువుదీరబోతోంది. ఇప్పటికే సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయగా, 25 మందితో నూతన క్యాబినెట్ రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనుంది. అయితే, ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు ఏపీ సీఎం జగన్ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే జగన్ ముఖ్యమైన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈసారి అన్ని శాఖలను ఒకేసారి సమావేశపరుస్తున్నారు. ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలతో పాటు నవరత్నాలు, అవినీతి రహిత పాలన వంటి అంశాలపై జగన్ అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వివిధ శాఖల పరిస్థితి, మార్పులపై అధికారుల నుంచి నివేదికలు కోరనున్నారు.