: ఒలింపిక్స్ లో భారత్ రీఎంట్రీ
భారత్ ఒలింపిక్ కష్టాలు తీరిపోయాయి. గత ఐదు నెలలుగా నిషేధం ఎదుర్కొంటున్న భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం ఎత్తివేసినట్టు భారత క్రీడాశాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ లూసానా నగరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని, ఒలింపిక్స్ లో భారత్ రీ ఎంట్రీకి అడ్డంకులు తొలగిపోయాయని అధికారులు తెలిపారు. గతంలో ఒలింపిక్ ఛార్టర్ కు ఐఓఏ కట్టుబడి లేదన్న కారణంగా సస్పెండ్ చేసిన ఐఓసీ నిబంధనలను ఒప్పుకుని పాటిస్తామని భారత ఒలింపిక్ అసోసియేషన్ హామీ ఇవ్వడంతో నిషేధాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించింది. దీంతో భారత ఒలింపిక్ అసోసియేషన్ కి త్వరలోనే స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, రాజకీయ ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించనున్నారు.