Chandrababu: చంద్రబాబును కలిసి పార్టీకి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రవాసాంధ్రురాలు
- ప్రజావేదికలో చంద్రబాబు బిజీ
- టీడీపీ అధినేతను కలిసిన ప్రవాసాంధ్రురాలు
- పార్టీ పట్ల ఆమె అభిమానానికి చంద్రబాబు అభినందన
ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబును నిత్యం కొన్ని వందల మంది కలుస్తున్నారు. అమరావతిలోని ప్రజావేదిక వద్ద తనను కలిసేవారితో ఫొటోలకు పోజులిస్తూ, టీడీపీ ఓటమి పట్ల బాధపడుతున్న వారిని ఓదార్చుతూ చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వేంపాటి కృష్ణవేణి అనే ప్రవాసాంధ్రురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీకి రూ.5 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో చంద్రబాబుకు అందజేశారు. పార్టీ పట్ల అభిమానంతో విరాళం ప్రకటించిన కృష్ణవేణిని, ఆమె కుటుంబాన్ని చంద్రబాబు అభినందించారు.