: బడ్జెట్ సమావేశాలపై నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ
ఈ నెల 21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం అవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? అన్న అంశంపై ఇందులో చర్చించనున్నారు. సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి చిదంబరం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, పలువురు ఉన్నత అధికారులు పాల్గొంటారు.