: మౌలిక వసతులు కల్పించకపోతే జగడమే: రాఘవులు
కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన రాఘవులు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు. బడులు తెరిచేనాటికి అన్ని వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.