Hyderabad: హైదరాబాద్ కు చల్లని కబురు... ఒక్కసారిగా మారిన వాతావరణం!
- నగరంలో చాలాచోట్ల వర్షాలు
- చల్లబడిన హైదరాబాద్
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి
మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో తడిసిముద్దయ్యాయి. గత నెలరోజులుగా భానుడి తీవ్రత కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా వర్షంతో నగరం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది.