: హస్తినలో సీఎం బిజీబిజీ


సీఎం హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసేపనిలో కిరణ్ కుమార్ రెడ్డి తల మునకలై ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కళంకిత మంత్రులను తొలగించిన నేపధ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని సీఎం నిన్న సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమయ్యారు. నేడు రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ తో భేటీ అయ్యారు. మరో వైపు నేడు పీపీసీ ఛీఫ్ బొత్స కూడా ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. దీంతో మంత్రి వర్గంలో మార్పులు ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Loading...

More Telugu News