TRS: ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం

- టీఆర్ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్సీ
- సర్టిఫికెట్ అందించిన అధికారులు
- నవీన్ రావును అభినందించిన మంత్రులు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ పదవి చేరింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ కు చెందిన నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరిరోజు కాగా, అంతకుముందు రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. వాటిలో ఒకటి నవీన్ రావుకు చెందినది. మరో నామినేషన్ లో సంతకాలు లేకపోవడంతో దాన్ని తిరస్కరించారు. గడువునాటికి నవీన్ రావు నామినేషన్ మాత్రమే మిగిలింది. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ను నవీన్ రావుకు అందించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్ రావును తెలంగాణ మంత్రులు అభినందించారు.