ysrcp: ఏపీలో పలు పథకాలకు పేర్ల మార్పు.. రాజన్న క్యాంటీన్లుగా మారనున్న అన్న క్యాంటీన్లు
- టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాల పేర్ల మార్పు
- రైతుల కోసం వైయస్ఆర్ భరోసా
- వైయస్ఆర్ పింఛన్ గా మారిన ఎన్టీఆర్ భరోసా
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాల పేర్లన్నీ మారబోతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పేరుతో నడుస్తున్న పెన్షన్ పథకాన్ని ఇప్పటికే వైయస్ఆర్ పింఛన్ గా మార్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారబోతోంది. రైతుల కోసం వైయస్ఆర్ భరోసా పథకం రాబోతోంది. అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్లుగా మార్చబోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే పథకాన్ని వైయస్ఆర్ చేయూత పథకంగా మార్చనున్నారు.