Jagan: జగన్ ను హత్తుకుని భావోద్వేగానికి గురైన విజయమ్మ... తల్లి కన్నీళ్లను తుడిచిన కొత్త సీఎం
- పూర్తయిన జగన్ ప్రమాణస్వీకారం
- వేదికపై భావోద్వేగాలు
- విజయమ్మ పుత్రవాత్సల్యం
ఏపీ నూతన సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఎన్నికల విజేత జగన్ తో ప్రమాణం చేయించారు. అనంతరం జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే జగన్ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతుండడాన్ని చూసి తల్లి విజయమ్మ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
జగన్ మాట్లాడుతున్నంతసేపు పట్టి ఉంచిన కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా జగన్ ను హత్తుకుని ఏడ్చేశారు. అదే సమయంలో కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం కూడా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తుండగా, జగన్ తల్లి కన్నీళ్లను తుడిచి అతిథులను సాగనంపుదాం రామ్మా అంటూ తోడ్కొని వెళ్లారు. సభలో అప్పటివరకు కనిపించిన ఆవేశపూరిత వాతావరణంలో విజయమ్మ చూపించిన పుత్రవాత్సల్యం అందరి కళ్లను చెమర్చేలా చేసింది. అసలైన పుత్రోత్సాహం విజయమ్మతో కనిపించింది.