: నేడు టాడా కోర్టులో లొంగిపోనున్న సంజయ్ దత్
1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ నేడు ముంబై టాడాకోర్టులో లొంగిపోనున్నాడు. కమిటైన సినిమాలు పూర్తికానందున లొంగిపోయేందుకు మరింత అదనపు సమయం కావాలంటూ పిటీషన్ వేయగా న్యాయమూర్తులు ఆ పిటీషన్ ను కొట్టివేసారు. దీంతో నేడు సంజయ్ దత్ టాడా కోర్టులో లొంగిపోనున్నాడు. సనాతనవాదుల నుంచి ప్రాణభయం ఉందని సంజయ్ అప్పీలు చేసుకోవడం, జైలు అధికారులకు గుర్తు తెలియని అగంతకుడి నుంచి సంజయ్ దత్ కు ప్రాణ హాని ఉందంటూ లేఖ రావడం నేపధ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జైలు బయట పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.