Jagan: అన్న సీఎంగా ప్రమాణం చేస్తుంటే చూసేందుకు కుమార్తె, కుమారుడితో వచ్చిన షర్మిల
- గన్నవరం విమానాశ్రయం చేరుకున్న షర్మిల
- రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం
- ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న షర్మిల
ఏపీ కాబోయే సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రేపు విజయవాడలో జరిగే ప్రమాణస్వీకారోత్సవంలో తన అన్నను సీఎంగా చూసేందుకు ఆమె తన కుమార్తె, కుమారుడితో కలిసి వచ్చారు. రేపు ఉదయం తన తల్లి విజయలక్ష్మి, వదిన భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణస్వీకారం జరగనుండగా, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున వస్తున్నట్టు తెలుస్తోంది.