Jagan: శుక్ర, శనివారాల్లో సచివాలయంలో జగన్!... సీఎం చాంబర్, నేమ్ ప్లేట్ లను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి
- సచివాలయంలో కొత్త సీఎం కోసం అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి
- స్వయంగా పర్యవేక్షించిన వైవీ
- ఏర్పాట్లపై సంతృప్తి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారు. ఆపై, రాష్ట్రానికి తిరిగివచ్చి శుక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇప్పటికే సచివాలయంలో సీఎం చాంబర్ ను సరికొత్తగా ముస్తాబు చేశారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్ లతో పాటు సీఎం నేమ్ ప్లేట్ ను కూడా వైసీపీ ముఖ్యనేత, జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం చాంబర్ లో మార్పులు చేర్పులు, సీఎం నేమ్ ప్లేట్ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. వైవీ ఆమోదించిన తర్వాతే పలు మార్పులను ఖరారు చేశారు.