chandrababu: కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం గమనిద్దాం: చంద్రబాబు
- సభకు హాజరవుదాం
- మన వాణిని బలంగా వినిపిద్దాం
- ప్రజలు భిన్నమైన తీర్పును ఇచ్చారు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదేళ్లు ఎంతో చిత్తశుద్ధితో పని చేశామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో 39.2 శాతం ఓట్లను రాబట్టామని తెలిపారు. టీడీపీ తరపున ఎన్నికైన వారిలో ముగ్గురు మినహా అందరూ పాతవారేనని... పాత, కొత్త కలయికతో మన వాణిని బలంగా వినిపించాలని సూచించారు. అన్ని రంగాలపై అధ్యయనం చేసి పట్టు సాధించాలని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం గమనిద్దామని... ఆ తర్వాత స్పందిద్దామని చెప్పారు. గతంలో వైసీపీ చేసినట్టు కాకుండా... సభకు హాజరు కావాలని అన్నారు. ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసినా... ప్రజలు భిన్నమైన తీర్పును ఇచ్చారని చెప్పారు. ప్రజల అంచనాలు మరో విధంగా ఉన్నాయని తెలిపారు.