: ఇప్పడే ఏమీ చెప్పలేం: రాజస్థాన్ రాయల్స్
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తమ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొంది. నిజానిజాలేంటో తెలియదని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపింది. ఈ విషయమై బిసిసిఐతో సంప్రదింపులు జరుపుతున్నామని, విచారణకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొంది. ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ఎటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.