: పెళ్లి కళ వచ్చేసిందే... బాలా!


రాష్ట్రానికి ఒక్కసారిగా పెళ్లి కళ వచ్చేసింది. ముహూర్తాలు ముంచుకొచ్చేశాయి. నేడు, రేపు, ఎల్లుండి (బుధ, గురు, శుక్రవారాలు) పెళ్ళికి సుమూహూర్తాలుగా సిద్ధాంతులు నిర్ణయించడంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెళ్లి మండపాలు శోభాయమానంగా అలంకరించుకున్నాయి. నందన నామ సంవత్సరానికి ఇవే ఆఖరి ముహూర్తాలు కావడం... మళ్ళీ మే మూడు వరకూ బలమైన ముహూర్తాలు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు ఈ మూడు రోజుల్లోనూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు.

ఈ మూడు రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద సుమారు లక్ష పెళ్ళిళ్ళు జరుగనున్నట్టు ఒక అంచనా. ఒక్క హైదరాబాదు నగరంలోనే సుమారు 40,000 పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టు లెక్కలు కడుతున్నారు. దీంతో కళ్యాణ మండపాలకు, పెళ్ళిళ్ళ సరంజామాకు ఎక్కడా లేని గిరాకీ వచ్చేసింది.

  • Loading...

More Telugu News