Chandrababu: ఈ నెల 28న గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
- ఆపై పార్టీ నేతలతో సమావేశం
- జూలైలో మహానాడు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 28న గుంటూరులో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. గుంటూరులోని టీడీపీ ఆఫీసు ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆపై పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రతి ఏడాది మహానాడు ఉత్సవాలను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే టీడీపీ ఈసారి ఆనవాయితీని తప్పింది. ఎన్నికల ఫలితాల హడావుడి ఉంటుందన్న కారణంతో ఎన్టీఆర్ జయంతిని యధావిధిగా మే 28న నిర్వహించి, ఆపై జూలైలో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.