Telangana: భానుడి భగభగలు... తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు
- తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
- రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు
- జూన్ 12 వరకు సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భానుడి ప్రతాపం తీవ్రస్థాయిలో ఉండడంతో జూన్ 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు జూన్ 1న తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరికొన్నిరోజుల పాటు సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.