: కేన్స్ చిత్రోత్సవంలో చిరంజీవి సందడి


కేన్స్ చిత్రోత్సవంలో తెలుగు స్టార్ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సందడి చేయనున్నారు. వందేళ్ల భారతీయ సినిమా పండుగను 66వ కేన్స్ చిత్రోత్సవంలో కూడా జరుపుతుండడం విశేషం. ఈ సందర్భంగా ప్రపంచ సినిమాకు భారతదేశం నుంచి సహాయ సహకారాలు, భారతీయ సినిమా పురోగతి వంటి విషయాలను 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' పేరిట ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు మన దేశం నుంచి ఓ బృందం బయలుదేరింది. ఈ బృందానికి చిరంజీవి నాయకత్వం వహిస్తారు. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'లైఫ్ ఆఫ్ పై' సినిమా పుదుచ్చేరి, మున్నార్ వంటి అందమైన ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న విషయాన్ని ఆ వేడుకలో చిరంజీవి వివరిస్తారు.

  • Loading...

More Telugu News