YSRCP: పర్చూరు నియోజకవర్గంలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి ఓటమి
- వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజయం
- దగ్గుబాటి ఆశలపై నీళ్లు!
చంద్రబాబునాయుడి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వైసీపీలో చేరిన ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి చవిచూశారు. ఏలూరి సాంబశివరావు పర్చూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగిస్తుందనడంలో సందేహంలేదు. ఎందుకంటే, ఆయనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా, జగన్ మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఓటమి ఆయన అవకాశాలను దెబ్బతీసింది.