YSRCP: మ్యాజిక్ ఫిగర్ 88... ఎప్పుడో దాటేసిన వైసీపీ!
- సెంచరీ అధిగమించిన వైసీపీ
- సాయంత్రానికి వైసీపీ గెలిచిన సీట్లు 106
- విపక్షంగా టీడీపీ
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రెండో పర్యాయం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం దిశగా దూసుకెళుతోంది. ఏపీ అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లు 175 కాగా, విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు. అయితే, వైసీపీ ఇప్పటికే 107 స్థానాలను కైవసం చేసుకుని, మరో 45కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇంచుమించు మ్యాజిక్ ఫిగర్ కు రెట్టింపు స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. మరోవైపు, టీడీపీ 17 స్థానాల్లో విజయం సాధించి, 9 స్థానాల్లో ముందంజలో నిలిచింది.