Telugudesam: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికీ తప్పని ఓటమి... నిరాశపర్చిన కళా వెంకట్రావు

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎదురుదెబ్బ
  • గొర్లె కిరణ్ కుమార్ చేతిలో పరాజయం
  • టీడీపీ ప్రముఖులకు తప్పని ఓటములు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనానికి ఎదురులేకుండా పోతోంది. ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ మొదలైన క్షణం నుంచి వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, టీడీపీ కనీస స్థాయిలో సీట్లు రాక డీలాపడిపోయింది. ఏపీ మంత్రుల్లో హేమాహేమీలు అనదగ్గవారంతా ఓటమిపాలైన నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు సైతం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసిన కళా వెంకట్రావు వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో పరాజయం చవిచూశారు. దాంతో ఓటమిపాలైన టీడీపీ ప్రముఖుల జాబితా మరింత పెరిగింది.

  • Loading...

More Telugu News