Andhra Pradesh: ఈ విజయాన్ని ముందుగానే ఊహించాం.. ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు!: వైఎస్ జగన్

  • జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్
  • మోదీకి శుభాకాంక్షలు
  • ప్రత్యేక హోదానే తమ ఏకైక అజెండా అని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 152, లోక్ సభలో 25 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు. ఈ విజయాన్ని తాము ముందుగానే ఊహించామని జగన్ తెలిపారు. తమను ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదానే తమ ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News