chandrababu: ఈ సాయంత్రం రాజీనామా చేయనున్న చంద్రబాబు!
- అన్ని ప్రాంతాల్లో వైసీపీ ఆధిక్యత
- తెలుగు దేశం శ్రేణుల్లో నిరాశ
- రాజీనామా పత్రం సమర్పణకు సిద్ధమైన చంద్రబాబు
తాజాగా వెలువడుతోన్న ఎన్నికల ఫలితాల్లో ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోంది. పలువురు మంత్రులు పరాజయం పాలవనున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఒక వైపున వైసీపీ శ్రేణులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటుంటే, మరో వైపున తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో నిరాశా నిస్పృహలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేతగా జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్టు తెలుస్తోంది.