Andhra Pradesh: పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ!

  • ఒక్క అవకాశాన్ని కోరిన జగన్
  • ఓట్ల రూపంలో వెల్లువెత్తిన అభిమానం
  • భారీ ఆధిక్యంలో వైసీపీ

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఊపందుకోగా, పలు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 175 నియోజక వర్గాలున్న ఏపీలో 162  స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడుతుండగా, వైసీపీ 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, తెలుగుదేశం పార్టీ కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన, కాంగ్రెస్ సహా మరే ఇతర పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

పవన్ కల్యాణ్ భీమవరంలో మూడో స్థానంలో, గాజువాకలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ పలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెల్లూరు, కడప, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. అధికార మార్పిడిని ప్రజలు స్పష్టంగా కోరుకున్నారని ఈ ఎన్నికల ఫలితాల సరళి తెలియజేస్తుండగా, మరోసారి రాజన్న రాజ్యం రానుందని వైసీపీ శ్రేణులు సంబరాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News