: ఇలా మీ వాళ్లకు సెంటేయొచ్చు...!
మీరు ఇంటికి రావడం ఆలస్యం కావడం వల్ల మీ ఆవిడ కోపంగా ఉందా... అయితే ఆమెను ఐస్ చేయడానికి చక్కటి మల్లెల వాసనను ఆమెకు సెల్ ద్వారా పంపేయండి... దీంతో ఆమె చక్కగా కూల్ అయిపోతుంది. అదే మీకు ఎవరైనా ఇష్టం లేదనుకోండి... వాళ్లని ఏడిపించాలంటే ముక్కులు పగిలిపోయేలాంటి దుర్గంధాన్ని వాళ్లకు ఫోన్ ద్వారా పంపేసి మీ కసి తీర్చుకోండి... ఏంటీ, మీకు నమ్మకం కలగడం లేదా... ఇది నిజమండీ...!
జపాన్‌కు చెందిన చాట్‌పెర్ఫ్ అనే సంస్థ ఇలా వాసనలను వెదజల్లేలా సెల్‌ఫోన్‌ను రూపొందించింది. ప్రస్తుతానికి ఇలాంటి టెక్నాలజీని యాపిల్ ఫోన్లకు అమర్చుకోవచ్చని ఈ సంస్థ చెబుతోంది. మరో విశేషమేమంటే... ఈ టెక్నాలజీ ద్వారా మనకు ఇష్టమైన వాసనలు వెలువడడమే కాదు... పరిస్థితులను బట్టికూడా ఇందులోంచి వాసనలొస్తాయట. అంటే మీరేదైనా వీడియో గేమ్ అడుతున్నారనుకోండి... అందులో తుపాకీ పేలగానే వెంటనే మనకు గన్‌పౌడర్ వాసన వస్తుందట. ఇలాంటి ఫోన్ సెప్టెంబరు నాటికల్లా మార్కెట్లోకి విడుదల చేయాలని చాట్‌పెర్ఫ్ సంస్థ భావిస్తోంది. భలేగా ఉందికదూ...!