India: దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు సర్వం సిద్ధం... రేపటితో మారిపోనున్న జాతకాలు!

  • లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి
  • గురువారం ఓట్ల లెక్కింపు
  • అభ్యర్థుల్లో ఉత్కంఠ

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 19తో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, రేపు (గురువారం) కౌంటింగ్ జరగనుంది. ఎంతో ప్రయాసభరితమైన ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. 542 లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి.

కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ బ్యాలెట్లు లెక్కించి ఆపై ఈవీఎంల ఓట్లను గణన చేస్తారు. చివరిగా మాత్రమే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటల లోపే ఓటింగ్ ట్రెండ్స్ తెలిసిపోతాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠకు లోనవుతున్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసి ఫలితాల కోసం సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News