Tibet: ధర్మశాలలో అధికార సిబ్బంది మాక్‌డ్రిల్‌.. దలైలామా ఆరోగ్యంపై అనుమానాలు!

  • గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన టిబెట్ ఆధ్యాత్మిక గురువు
  • ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో ఇటీవల ఆసుపత్రిలో చేరిక
  • 48 గంటల అబ్జర్వేషన్‌ తర్వాత డిశ్చార్జి చేసిన వైద్యులు

టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరోగ్యంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆరోగ్యం సహకరించక గత కొంతకాలంగా దలైలామా ఇంటికే పరిమితమయ్యారు. 83 ఏళ్ల వయసున్న దలైలామా ఇటీవల ఛాతి ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు.  48 గంటల అబ్జర్వేషన్‌ తర్వాత వైద్యులు దలైలామాను డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి ఆయన బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ధర్మశాలలో అధికార సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తుండడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా  ఆధ్యాత్మిక గురువులు అనారోగ్యం పాలైనప్పుడే ముందస్తు చర్యగా ఇలా మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. ఓ అంబులెన్స్‌తోపాటు పదుల సంఖ్యలో వాహనాలు వరుసపెట్టి ధర్మశాలకు వెళ్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దలైలామా పరిస్థితి ఎలా ఉందన్న దానిపై సమాచారం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఆరోగ్యం సహకరించక పోవడంతో ఏడాది కాలంగా దలైలామా మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ పర్యటించలేదు.

More Telugu News