Chandrababu: చంద్రబాబు సూచనలకు స్పందించిన ద్వివేది!
- కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ ఇవ్వాలన్న చంద్రబాబు!
- తప్పకుండా అందిస్తామన్న సీఈవో
- ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తామంటూ స్పష్టీకరణ
లెక్కింపు కేంద్రాల్లోని కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ ఇవ్వడంతో పాటు, వారికి వేళకు తగిన ఆహారం అందించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన సూచనల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ తప్పకుండా అందిస్తామని చెప్పారు. లెక్కింపు కేంద్రం లోపల ఎన్ని టేబుళ్లు ఉంటే అంతమంది కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.