Andhra Pradesh: ఐఏఎస్ హోదా పొందిన ముగ్గురు ఏపీ నాన్ కేడర్ అధికారులకు పోస్టింగులు ఇచ్చిన సీఎస్
- చినవీరభద్రుడికి గిరిజనశాఖ అడిషనల్ డైరెక్టర్ గా పోస్టింగ్
- గవర్నర్ కు సంయుక్త కార్యదర్శిగా అర్జునరావు నియామకం
- వాణిజ్యపన్నుల శాఖలో రాజబాబు కొనసాగింపు
రాష్ట్రంలో మరో ముగ్గురు నాన్ కేడర్ అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఐఏఎస్ హోదా పొందిన ఆ ముగ్గురు అధికారులను కీలక విధుల్లో నియమించారు. చినవీరభద్రుడికి గిరిజనశాఖ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు కేటాయించారు. మరో అధికారి పి. అర్జునరావును రాజ్ భవన్ లో గవర్నర్ కు సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం వాణిజ్యపన్నుల శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న రాజబాబును అవే బాధ్యతల్లో కొనసాగిస్తున్నట్టు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.