Central: కేంద్రంలో ఈసారి ‘హంగ్’ రావొచ్చు: లగడపాటి సర్వే

  • మెజార్టీ సంఖ్యకు దగ్గరలో ఎన్డీఏ ఆగిపోతుంది
  • ఏ పార్టీకైనా ఎస్సీ,ఎస్టీ, బడుగు వర్గాల మద్దతు ముఖ్యం
  • ‘సంక్షేమం’,‘అభివృద్ధి’ అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు

కేంద్రంలో ‘హంగ్’ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సర్వే వివరాలను తిరుపతి వేదికగా ఈరోజు ఆయన ప్రకటించారు. మెజార్టీ సంఖ్యకు దగ్గరలో ఎన్డీఏ ఆగిపోతుందని భావించారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు మొదట పరిగణనలోకి తీసుకునే అంశాలు ‘సంక్షేమం’, ‘అభివృద్ధి’ అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సర్వేలో తమ అంచనాలు తప్పాయని, మళ్లీ తేడా వస్తే కచ్చితంగా ప్రజలకు తనపై నమ్మకం పోతుందని అన్నారు. ‘నేను చెప్పింది వినేవాళ్లు లేకుండా పోతారు’ అని అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బడుగు వర్గాల మద్దతు ఎవరికైతే ఉంటుందో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందని అన్నారు. కేవలం, ఆయా పార్టీలకు చెందిన సామాజిక వర్గాలతో మాత్రమే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంపైనే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఏపీలో పార్టీలకు వచ్చే సీట్లపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఏపీ ప్రజలు కోరికలు నెరవేరుతాయని అన్నారు. అలా జరగిన పక్షంలో మళ్లీ పోరాటం తప్పదని అభిప్రాయపడ్డారు.  

More Telugu News