India: 'స్వలింగ' బంధంలో ఉన్నానంటూ సంచలన ప్రకటన చేసిన భారత అథ్లెట్ ద్యుతి

  • ఆసియా క్రీడల్లో సత్తాచాటిన మహిళా స్ప్రింటర్
  • 'స్వలింగ' ప్రకటనతో దిగ్భ్రాంతికి గురైన భారత క్రీడావర్గాలు
  • భాగస్వామి పేరు వెల్లడించని ద్యుతి

గతేడాది ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ సంచలన ప్రకటన చేసింది. తాను స్వలింగ సంబంధంలో ఉన్నట్టు పేర్కొంది. భారత అథ్లెటిక్స్ రంగంలో ఆశాకిరణంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ 23 ఏళ్ల మహిళా స్ప్రింటర్ తాజా ప్రకటనతో భారత క్రీడారంగం సహా అందరూ నివ్వెరపోయారు.

తనకు లైఫ్ పార్టనర్ దొరికిందని, జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ఇది తన వ్యక్తిగత విషయంగా పేర్కొన్న ద్యుతి ఇకపై తన దృష్టంతా వరల్డ్ చాంపియన్ షిప్, ఒలింపిక్ క్రీడలపైనే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, తాను ఎవరితో స్వలింగ సంబంధంలో ఉందో మాత్రం ద్యుతి వెల్లడించలేదు.

100 మీటర్ల పరుగులో 11.24 సెకన్లతో ద్యుతీ అద్భుతమైన టైమింగ్ నమోదుచేసి భారత్ లో ఫాస్టెస్ట్ ఉమన్ గా గుర్తింపు సాధించింది.

  • Loading...

More Telugu News