BJP: మోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ తెలంగాణలో రాజశ్యామల యాగం

  • యాగం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ప్రతినిధి రాకేశ్ రెడ్డి
  • హాజరైన బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్
  • మోదీకి భగవంతుడి దీవెనలు ఉన్నాయన్న లక్ష్మణ్

నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి పీఠంపై కూర్చోవాలంటూ తెలంగాణలో రాజశ్యామల మహా యాగం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేశ్ రెడ్డి వరంగల్ జిల్లా హన్మకొండలోని విష్ణు గార్డెన్స్ లో శనివారం ఈ యాగం చేపట్టారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన రాజశ్యామల యాగానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300కి పైగా స్థానాల్లో గెలుపు తథ్యమని, మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఆయనకు భగవంతుడి దీవెనలు మెండుగా ఉన్నాయని తెలిపారు. జనరంజక పాలన అందిస్తున్న మోదీనే మళ్లీ ప్రధాని కావాలన్నది భారత ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. భారతదేశం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలన్నా, శత్రుదేశాల నుంచి రక్షణ ఉండాలన్నా బీజేపీనే అధికారంలోకి రావాలని అన్నారు.

  • Loading...

More Telugu News