: ఆ లైట్ల వల్ల కళ్లు పోతున్నాయట!


పర్యావరణానికి మేలు చేసేవి అంటూ ప్రచారం జరుగుతున్న ఎల్‌ఈడీ లైట్ల వల్ల మన కళ్లు పోయే ప్రమాదముందట. ఈ విషయం ఒక తాజా పరిశోధనలో తేలింది. మాడ్రిడ్‌ లోని కంప్లుటెన్స్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు సెలియా శాంచెజ్‌ రామోస్‌ ఎల్‌ఈడీ లైట్ల గురించి మాట్లాడుతూ మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే ఎల్‌ఈడీ కంప్యూటర్లు, టీవీలు, లైట్లు వంటి వాటి వల్ల మన కంటిలోని కీలకమైన భాగం రెటీనా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ లైట్ల నుండి వచ్చే అధిక రేడియేషన్‌ వల్ల కళ్లు బాగా పాడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మనిషి తన జీవిత కాలంలో ఎక్కువ భాగం కాంతిలోనే గడుపుతాడు. సుమారు ఆరువేల గంటల పాటు కళ్లను తెరుచుకునే ఉంటాడు. అయితే ఈ కాలంలో మనిషి ఎక్కువగా కృత్రిమ కాంతినే చూస్తారని, అలాంటప్పుడు మనిషి చూసే ఈ కృత్రిమ కాంతి ఎల్‌ఈడీ లైట్ల రూపంలో గనుక ఉంటే ప్రమాదం ఎక్కువవుతుందని ఆయన వివరించారు. ఒక్కసారి గనుక రెటీనా పాడైతే దానిని తిరిగి సాధించలేమని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే చలువ కళ్లజోడును వాడాలని కూడా ఆయన సూచించారు. ఈ విషయాన్ని థింక్‌స్పెయిన్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది.

  • Loading...

More Telugu News