Telangana: జడ్పీ చైర్మన్ ఎన్నికకు 40 రోజులు వద్దు, ప్రలోభాలకు గురిచేస్తారు... మూడు రోజులు చాలు: తెలంగాణ విపక్షాలు
- ఈసీని కలిసిన విపక్ష నేతలు
- జడ్పీ చైర్మన్ ఎన్నిక వ్యవధిపై విజ్ఞప్తి
- కేసీఆర్ పై విమర్శలు
తెలంగాణ విపక్షాలు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికకు 40 రోజుల సుదీర్ఘ సమయం ఇవ్వడం ద్వారా ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని, కేవలం 3 రోజుల వ్యవధి చాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాలు వెల్లడైన మూడ్రోజుల్లోపు జడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగితే ఎలాంటి అపోహలు ఉండవని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సైతం సర్కారుపై విమర్శలు చేశారు. గత 11 నెలలుగా తెలంగాణలో ప్రభుత్వమే లేదని అన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈసీ కుమ్మక్కయినట్టుగా సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ చట్టాలపై కేసీఆర్ కు గౌరవం లేదని విమర్శించారు.