India: దేశవ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

  • మే 19న ఏడో విడత పోలింగ్
  • 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు
  • బరిలో మోదీ, రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్న సిన్హా

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టితో తుది విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. మొత్తం ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు ఆరు దశలు పూర్తి కాగా, ఎల్లుండి చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడో విడత ఎన్నికలకు నేటితో ప్రచారానికి తెరపడింది. మే 19న 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

ఉత్తరప్రదేశ్ లో 13, పంజాబ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 8, మధ్యప్రదేశ్ లో 8, హిమాచల్ ప్రదేశ్ లో 4, జార్ఖండ్ లో 3, చండీగఢ్ లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికల మొత్తం ఫలితాలను మే 23న వెలువరిస్తారు. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. కాగా, తుది విడత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్న సిన్హా తదితరులు బరిలో ఉండడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News